పూరి, వినాయక్ ల దర్శకత్వం లో నటించనున్న సాయి ధరమ్ తేజ్
- November 14, 2016
మెగాహీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కెరీర్ ప్రారంభంలో తన మొదటి మూవీతో ఇబ్బంది పడ్డ సాయిధరమ్ తేజ్, తరువాత మాత్రం జెడ్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడనే చెప్పాలి. ఎందుకంటే సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ఉన్న మెగాహీరోల కంటే ఎక్కువుగా చిత్రాలలో నటిస్తున్నాడు. అలాగే తన మూవీలను ఒకే సంవత్సరంలో కనీసం 2, 3 చిత్రాల వరకూ రిలీజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం మెగాహీరోలలో ఒక్క సాయిధరమ్ తేజ్ మాత్రమే ఈ విధంగా ఎక్కవ మూవీలను చేస్తున్నాడని చెప్పాలి. ఇదిలాఉంటే తాజాగా సాయిధరమ్ తేజ్ కి గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. వీటి వివరాలను చూస్తే...వరుస విజయాలతో తన స్థాయిని పెంచుకున్న సాయిధరమ్ తేజ్..ప్రస్తుతం 'విన్నర్' అనే కమర్షియల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై సాయిధరమ్ తేజ్ భారీ అశలు పెట్టుకున్నారు.
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే సాయిధరమ్ తేజ్ త్వరలోనే ఇద్దరు ప్రముఖ డైరెక్టర్స్ తో నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఒకటి వినాయక్ దర్శకత్వంలో...రెండోవది పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించనున్నారని అంటున్నారు. సాయిధరమ్ తేజ్ లోని మాస్ యాంగిల్ వీరిద్దరికీ తెగ నచ్ఛటంతో...పూరీ, వినాయక్ లు సాయిధరమ్ తేజ్ కోసమే ప్రత్యేకమైన కథలను రాసుకున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయని అంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సాయిధరమ్ తేజ్ నటించారంటే...అది కచ్ఛితంగా సాయిధరమ్ తేజ్ కి బంపర్ ఆఫర్స్ ని చెప్పవచ్చు. ఇక సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న విన్నర్ మూవీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి 24, 2017న విడుదల కానుంది.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









