మయన్మార్‌లో 25 మంది ఊచకోత
- November 14, 2016
మయన్మార్‌లోని రఖయిన్ రాష్ట్రంలో రొహింగ్య ముస్లింల ఊచకోతలు ఆగడంలేదు. 25 మంది రొహింగ్య ముస్లింలను ఆదివారం హతమార్చినట్టు మయన్మార్ ఆర్మీ ప్రకటించింది. గొడ్డళ్లు, లాఠీలు కలిగి ఉన్నందు వల్లే వారిని చంపినట్టు తెలిపింది. కాగా, సామాజిక మాధ్యమాల్లోని ఫొటోలు, వీడియోల ద్వారా హతమైనవారిలో చిన్నపిల్లలు, మహిళలూ ఉన్నట్టుగా తెలుస్తోంది. రఖయిన్ రాష్ట్రం లో స్వతంత్రంగా పనిచేస్తున్న మీడియా సంస్థ ఏదీ లేదు. దీంతో ఆర్మీ అధికారులు చెప్పిందే వేదం. రొహింగ్య ప్రజలు గొడ్డళ్లు, లాఠీలతో దాడులు చేశారని, ఉద్రిక్తతలు పెంచేందుకు తమ ఇళ్లకు తామే నిప్పుపెట్టుకున్నారని ఆర్మీ అధికారులు తెలిపారు. కాగా, ఆర్మీ అధికారులు చెప్పిన దానికి, రొహింగ్య సామాజిక మాధ్యమాలు చెప్పేదానికి పొంతన లేదు.మృతు సంఖ్య వస్తవానికి చాచా ఎక్కువే ఉంటుందని అవి పేర్కొన్నాయి. రఖయిన్లో ఆర్మీ ప్రభుత్వం కనుసన్నల్లో కాకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మయన్మర్ నేత అంగ్ సాంగ్ సూకీ మౌనం వహిస్తున్నారు. చాలా రోజులుగా రొహింగ్య గ్రామాలపై హెలికాప్టర్ గన్‌షిప్‌లతో ఆర్మీ దాడులు చేస్తోంది.
వందలాది రొహింగ్య ముస్లింలు గ్రామాలను విడిచి వెళ్లేలా బలవంతం చేస్తోంది. దేశంలో పది లక్షల మంది రొహింగ్య ముస్లింలు ఉన్నారు. వీరిని మయన్మార్ ప్రభుత్వం దేశ పౌరులుగా గుర్తించడం లేదు. 2012లో అప్పటి మిలటరీ ప్రభుత్వం, బౌద్ధసన్యాలు కలిసి రొహింగ్య ముస్లింలను ఊచకోత కోసారు.
వారి గ్రామాలను దహనం చేశారు, మహిళలను, పిల్లలను అపహరించారు. దీంతో, వేలాది మంది రొహింగ్యాలు దేశం విడిచి ఇతర దేశాల్లో శరణార్థులుగా జీవిస్తున్నారు.
తాజా వార్తలు
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు







