నాగ్ కు పుట్టిరోజు శుభాకాంక్షలు

- August 28, 2015 , by Maagulf
నాగ్ కు పుట్టిరోజు శుభాకాంక్షలు

ఈ రోజు మన్మధుడు, కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు. ఈ వేడుకను అభిమానులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ అతి కొద్ది కాలంలోనే తనకంటూ ఇమేజ్ క్రియోట్ చేసుకున్నారు నాగార్జున. మిగతా హీరోలకు భిన్నంగా.... గీతాంజలి సినిమాతో మొదలైన ఆయన ప్రయోగాల పర్వం నేటికి కొనసాగుతుంది. శివ సినిమాతో తెలుగు సినిమా ట్రెండ్ మార్చారు. ఒకవైపు సినీ రంగంలో హీరోగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా రాణిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ మంచి పేరు తెచ్చుకున్న ఆయన శుక్రవారం 57వ ఏట అడుగు పెడుతున్నారు. నాగార్జున 1959 ఆగష్టు 29న చెన్నైలో జన్మించాడు. మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎమ్.ఎస్ చేసి 1986లో 'విక్రమ్' సినిమాతో ఇండస్ట్రీలో అరంగ్రేటం చేసాడు. మొదటనుంచి నాగార్జున కొత్త దర్శకులని, కొత్త కాన్సెప్ట్ లని బాగా ఎంకరేజ్ చేస్తూ, పరిశ్రమకు కొత్త రక్తం ఎక్కిస్తూ వస్తున్నారు. అలాగే నటుడుగా... యాక్షన్, లవ్ స్టొరీ సినిమాలే కాదు భక్తిరసమైన సినిమాలు చేసి కూడా మెప్పించగలనని నిరూపించారు. కె. రాఘవేంద్ర రావు దర్శకతక్వంలో వచ్చిన అన్నమయ్య ఆయన కెరీర్లో టాప్ సినిమా. అలాగే శ్రీ రామదాసు పాత్రలో కూడా అటు విమర్శకుల ప్రశంసల్ని ఇటు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. సాయి బాబా పాత్రలో కూడా మెప్పించారు. వయస్సు పెరుగుతున్నప్పటికీ యంగ్ హీరోలతో పోటి పెడుతున్న ఈ నవ యువకుడుకి మాగల్ఫ్ తరుపున శుభాకాంక్షలు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com