ఖతార్ నుంచి బహ్రెయిన్‌కి ఫెర్రీ: వచ్చే ఏడాదిలో
- November 14, 2016
స్థానిక సంస్థ ఒకటి, తొలి ప్యాసింజర్ మరియు వెహికిల్ ఫెర్రీని పర్యాటకుల్ని ఆకర్షించేందుకుగాను ఖతార్ - బహ్రెయిన్ మధ్య నడపడానికి యోచిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ ఫెర్రీ అందుబాటులోకి రావొచ్చు. ఖతార్‌లోని అల్ రువాయిస్ పోర్ట్ నుంచి బహ్రెయిన్‌లోని ఖలీఫా బిన్ సల్మాన్ పోర్ట్ వరకు ఈ ఫెర్రీ నడవనుంది. ఈ ఫెర్రీలో కొన్ని పర్సనల్ అలాగే కమర్షియల్ వెహికిల్స్‌ని కూడా తీసుకెళ్ళే అవకాశముంది. ఈ తరహాలో ఇదే గల్ఫ్ దేశాల్లో తొలి ఫెర్రీ కానుందని సమాచారమ్. బహ్రెయిన్ నుంచి ఖతార్ వెళ్ళేందుకు రోడ్డు మార్గంలో 4.5 గంటల సమయం పట్టనుండగా, ఫెర్రీ ద్వారా కేవలం 1.5 నుంచి 2.5 గంటల్లోనే చేరుకునే అవకాశముంటుంది. ఖతార్ - బహ్రెయిన్ మధ్య దూరం తగ్గించేందుకు కాజ్‌వే నిర్మాణం జరపాలనే యోచన చేసినప్పటికీ కొన్ని కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. బహ్రెయిన్‌కి వెళ్ళే ఫెర్రీ సక్సెస్ అయితే, ఖతార్ నుంచి యూఏఈకి కూడా భవిష్యత్తులో ఫెర్రీలు నడిపే అవకాశం ఉంటుంది. గతంలో ఓ కమర&ఇషయల్ ఫెర్రీ ఖతార్ మరియు ఇరాన్ మధ్య నడిచినా, కొన్ని అనివార్య కారణాలతో కొంత కాలం క్రితమే ఆ సర్వీస్ రద్దు చేయబడింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







