జాయింట్ ఇన్‌స్పెక్షన్స్‌కి ఖతార్ ఓకే
- November 15, 2016
ఖతార్ వరల్డ్ కప్ 2022 నిర్వాహకులు, ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ ఇన్‌స్పెక్షన్స్‌కు అనుమతి లభించినట్లు తెలిపారు. ఖతార్ సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ అండ్ లెగసీ, గ్లోబల్ బిల్డింగ్ అండ్ ఉడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బిడబ్ల్యుఐ) గ్రూప్ జాయింట్ ఇన్‌స్పెక్షన్‌కి అనుమతి తెలిపింది. స్టేడియంల నిర్మాణం, అలాగే అకామడేషన్‌కి సంబంధించి ఈ తనిఖీలు ఉంటాయి. కార్మికుల భద్రతకు సంబంధించి ఇదొక కీలక పరిణామం అని కమిటీ హెడ్ హసన్ అల్ తవ్వాది చెప్పారు. ఖతార్ కమిట్‌మెంట్‌కి ఇది నిదర్శనం అని ఆయన అన్నారు. జనవరి 2017లో ఈ తనిఖీలు ప్రారంభమవుతాయి. బిడబ్లుఐలో మొత్తం 13 మంది ప్రతినిథులు ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా 300 ట్రేడ్ యూనియన్స్‌కి వీరు ప్రాతినిథ్యం వహిస్తారు. బిడబ్ల్యుఐ జనరల్ సెక్రెటరీ అంబెట్ యూసున్ మాట్లాడుతూ, 2022 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణకు సంబంధించి కార్మికుల భద్రతకు ఇది అత్యంత కీలకమైన విషయమని అన్నారు. తనిఖీల అనంతరం ఇచ్చే రిపోర్ట్ ఇండిపెండెంట్‌గా ఉంటుందని, పబ్లిక్ కోసం విడుదల చేయబడ్తుందని బిడబ్ల్యుఐ వెల్లడించింది. వరల్డ్ కప్ ప్రాజెక్టు కోసం 10,000 నుంచి 30,000 మంది కార్మికులు పనిచేయనున్నారు. కార్మికుల కోసం ఖతార్ ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. గత ఏడాది వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ని తీసుకొచ్చింది. లేబర్ సమస్యల కోసం న్యాయమూర్తి నేతృత్వంలోని ఓ ప్యానెల్‌ని కూడా ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







