వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్..
- November 16, 2016
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. కృష్ణాజిల్లా మూలపాడులోని ఏసీఏ-కేడీసీఏ మైదానంలో బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో రాణించిన ఓపెనర్ స్మృతి మందన (5), కెప్టెన్ మిథాలీ రాజ్ (15) విఫలమైనా.. వేదక కృష్ణమూర్తి (71 పరుగులు, 79 బంతులు, 10×4) సత్తా చాటడంతో భారత్ కుదురుకుంది. దీప్తి శర్మ (23), దేవిక వైద్య (32నాటౌట్)కూడాపర్వాలేదనిపించారు.అనంతరం రాజేశ్వరి గైక్వాడ్ (4/34) విజృంభించడంతో విండీస్ 49.1 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూస్ (44), నైట్ (55) రాణించారు
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







