ఇండోనేషియా లో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదు

- November 17, 2016 , by Maagulf
ఇండోనేషియా లో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదు

ఇండోనేసియాలో బుధవారం అర్థరాత్రి భారీ భూకంపం సంభవించింది. తూర్పు జావా ప్రావిన్స్‌లోని బాలి ద్వీపంలో రిక్టర్‌ స్కేల్‌పై 6.2 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించింది. బాలి, జావా ప్రావిన్స్‌లోని పలు పట్టణాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మలాంగ్‌ ప్రావిన్స్‌కు 127 కిలోమీటర్ల దూరంలో 69 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని.. ప్రాణ, ఆస్తి నష్ట వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com