సుష్మాకు పెద్ద కష్టమే వచ్చింది....!
- November 17, 2016
కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్... కిడ్నీ దాత కోసం ఎదురుచూస్తున్నారు. మూత్ర పిండాలు పూర్తిగా దెబ్బతినడంతో ప్రస్తుతం ఆమెకు డయాలసిస్ నిర్వహిస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఆమెకు పరీక్షలు జరుగుతున్నాయి. ముఖంపై ఎప్పుడూ చెదరని చిరునవ్వు... భారత సంస్కృతిని ప్రతిబింబించే చీరకట్టు సుష్మా స్వరాజ్ సొంతం. బీజేపీలోనే కాదు.. కేంద్ర మంత్రివర్గంలోను సుష్మా ఫైర్ బ్రాండ్. ట్విట్టర్‌లోను ఆమె చాలా యాక్టివ్. ప్రజా సమస్యలకు వెంటనే స్పందించడం ఆమె నైజం. ప్రస్తుతం సుష్మాకు పెద్ద కష్టమే వచ్చింది. ఆమె మూత్ర పిండాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నెల 7న ఎయిమ్స్ లో చేరిన సుష్మాకు డయాలసిస్ జరుగుతోంది. ఈ విషయం ఆమె స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం టెస్ట్‌లు చేయించుకుంటున్నానని, దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని అని సుష్మ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు సుష్మా మూత్రపిండాల మార్పిడికి మరికొంత సమయం పడుతుందని, సరైన దాత కోసం అన్వేషిస్తున్నట్టు డాక్టర్లు చెప్పారు. అయితే కిడ్నీలు దానం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇక సుష్మా త్వరగా కోలుకోవాలని పార్టీలకు అతీతంగా నేతలు ఆకాంక్షించారు. భగవంతుడి ఆశీస్సులతో ఆమె ఆరోగ్యం మెరుగవ్వాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా , రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా, టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







