ఇమ్మిగ్రేషన్‌ అధికారుల్లా స్కామర్స్‌

- November 17, 2016 , by Maagulf
ఇమ్మిగ్రేషన్‌ అధికారుల్లా స్కామర్స్‌

మనామా: బహ్రెయిన్‌ నివాసితులు, ఇమ్మిగ్రేషన్‌ అధికారుల్లా వేషం మార్చిన కొందరు స్కామర్స్‌తో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇమ్మిగ్రేషన్‌ అధికారులమని చెబుతూ ఫోన్‌ కాల్‌ ద్వారా రెసిడెంట్స్‌ని బెదిరించి, వారి నుంచి పెద్దమొత్తాల్లో కొందరు వసూలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వెళ్ళింది. ఇలా ఎవరైనా ఫోన్‌ కాల్‌ చేసినప్పుడు తక్షణం పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. స్మితా షైజు అనే వ్యక్తి ఇదే తరహాలో ఫోన్‌ కాల్‌ని ఎదుర్కొన్నారు. ఇమ్మిగ్రేషన్‌ నెంబర్‌ తరహాలోనే వారు ఫోన్‌ చేసిన నెంబర్‌ ఉందని స్మిత వెల్లడించారు. వారికి తన నెంబర్‌ ఎలా తెలిసిందో అర్థం కాలేదనీ, తనపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు బెదిరించారనీ, పేమెంట్‌ డ్యూస్‌ చెల్లించకపోతే కఠిన శిక్షలు తప్పవని చెప్పారని ఆమె వివరించారు. స్పూఫ్‌ కాలర్‌ ఐడి ద్వారా ఇలాంటి స్కామర్స్‌ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రెసిడెంట్స్‌ అప్రమత్తంగా ఉండటంతోపాటు, ఇమ్మిగ్రేషన్‌ అధికారులమని ఎవరైనా కాల్‌ చేసినప్పుడు వ్యక్తిగత వివరాలు వెల్లడించరాదని అధికారులు సూచించడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com