గూగుల్‌లో రాంగ్ వాల్యూ: బహ్రెయిన్ దినార్‌పై పానిక్
- November 17, 2016
బహ్రెయిన్ వాసుల్లో, మరీ ముఖ్యంగా వలసదారుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది గూగుల్‌లో బహ్రెయినీ దినార్ (బిహెచ్డి) వాల్యూ తక్కువగా చూపించడంతో. 1 బహ్రెయినీ దినార్ విలువని 3.84 డాలర్లుగాను, 14.11 యూఏఈ దిర్హామ్గాను, 260.81 ఇండియన్ రూపీగానూ, 402.5 పాకిస్తానీ రూపీగానూ, 189.9 ఫిలిప్పినో పెసోగానూ, 302.96 బంగ్లాదేశీ టాకాగానూ ఉదయం కనిపించింది. ఈ వివరాల్ని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. అయితే బహ్రెయిన్ అధికారులు మాత్రం దీన్ని ఓ టెక్నికల్ మిస్టేక్‌గా కొట్టి పారేశారు. బహ్రెయిన్ దినార్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో గూగుల్ తన తప్పిదాన్ని సరిచేసుకుంది. 1 బహ్రెయినీ దినార్ 9.6 యూఏఈ దిర్హామ్‌లుగా, 207 బంగ్లాదేశీ టాకాగా, 2 బ్రిటిష్ పౌండ్లుగా, 176.6 ఇండియన్ రూపీస్గా, 127.8 ఫిలిప్పినో పెసోగా, 275.4 పాకిస్తానీ రుపీస్‌గా ఉంది. కొన్ని వెబ్సైట్లు 1 బహ్రెయినీ దినార్ విలువని 235 భారత రుపీస్‌గా చిత్రీకరించడంలో వాస్తవం లేదని బహ్రెయిన్ ఫైనాన్స్ కంపెనీ జోనల్ మేనేజర్ విపిన్ మాథ్యూ తెలిపారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









