రష్యా వైమానిక దాడుల్లో ముగ్గురు అల్‌ఖైదా కమాండర్స్ హతమయ్యారు
- November 18, 2016
రష్యా భద్రతా బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు అల్‌ఖైదా ఉగ్రసంస్థ కీలక కమాండర్స్ హతమయ్యారు. ఈ విషయాన్ని రష్యా రక్షణశాఖ అధికార ప్రతినిధి ఐగర్ కోనషెంకేవ్ ధ్రువీకరించారు. అలెప్పోలో భారీ విధ్వంసాలకు పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు వైమానిక దాడులు నిర్వహించామని చెప్పారు. గురువారం ఇద్లిబ్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని అడ్మైరల్ కుజ్‌నేత్సోవ్ వైమానిక స్థావరం నుంచి ఎస్‌యూ-33 యుద్ధవిమానంతో దాడులు నిర్వహించినట్టు తెలిపారు. ఈ దాడుల్లో ఐఎస్ కమాండర్స్ మొహ్మద్ హెలాలా, అబూ జాబెర్ హర్మూజా, అబుల్ బాహా అల్-సఫారీలతో మరో 30 మంది ఉగ్రవాదులు కూడా మృతిచెందినట్టు కోనషెంకేవ్ చెప్పారు.ఇదిలా ఉండగా, ఇద్లిబ్, హామ్స్ నగరాల్లో ఇటీవలి కాలంలో ఐఎస్ కార్యకలాపాలు శృతిమించాయి. తాజాగా ఆత్మాహుతి దాడులకు పాల్పడి మారణహోమం సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను రష్యా బలగాలు భగం చేశాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







