మీ పిల్లల్లో ఆ సమస్య ఉందా?
- August 29, 2015
సాధారణంగా పిల్లల్లో ఐదేళ్లు వచ్చే సరికి యూరినల్ కంట్రోల్ వచ్చేస్తుంది. కానీ కొద్దిమంది పిల్లల్లో ఈ కంట్రోల్ అనేది ఉండదు. సహజంగా 95శాతం మంది పిల్లల్లో ఇది సమస్య కానే కాదు. కానీ మిగిలిన 5 శాతం మంద పిల్లల్లో రాత్రిళ్లు పక్క తడిపే అలవాటు ఉంటుంది. దీనికి అనేక రకాల కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది హార్మోన్స్ అసమతుల్యం కూడా కావచ్చు. అంతేకాదు పిల్లల్లో అడినాయిడ్స్ కూడా ఒక కారణం కూడా కావచ్చు. ఈ సమస్య ఉన్న పిల్లలను ముందు తల్లితండ్రులు శిక్షించకూడదు. సున్నితంగా నచ్చచెప్పాలి. నిద్రపోయేముందు చక్కెర, కెఫిన్లాంటి పదార్ధాలు ఉన్న ఆహారాన్ని ఇవ్వకూడదు. ద్రవ పదార్ధాలను సాయంత్రం ఆరు దాటాక ఇవ్వడం ఇక తగ్గించాలి. రాత్రి పడుకునే ముందు ఒకసారి మూత్ర విసర్జన చేయించాలి. పడుకున్న తర్వాత ఒక గంట పోయినాక లేపి మళ్లీ బాతురూంకి పంపించాలి. ఇలా చేయడం వల్ల క్రమక్రమంగా ఈ అలవాటు తగ్గే అవకావం ఉంటుంది. ఈ సమస్యకు హార్మోన్ లోపాలు కారణం అయితే 3 - 6 నెలలపాటు మందులు వాడడం వల్ల సమస్యను 50శాతం మందిలో అదుపు చేయవచ్చు. ఇంకా ఈ సమస్య అదుపులోకి రాకపోతే పిల్లల డాక్టర్ల ఆధ్వర్యంలో తగు చికిత్స చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









