గుడారాలలో సెలవులు గడిపేవారికి భద్రతా సూచనల జారీ
- November 19, 2016
ప్రస్తుతం గుడారాలు నిర్మించుకొని కాలం దృష్ట్యా ఈ క్రమంలో బాలల చేష్టలను పర్యవేక్షించడానికి ముందు జాగ్రత్త చర్యలు మిళితం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ (మోయి ) పలు భద్రతా సూచనలను జారీ చేసింది. వారమంతా కష్టించి చురుకుగా పని చేసిన అనంతరం వారాంతపు సెలవులలో విశ్రాంతి తీసుకునేందుకు చాలా కుటుంబాలు మరియు వ్యక్తులు ఇటీవల క్యాంపింగ్ మరియు వినోద పర్యటనలు పలుచోట్ల నిర్వహించుకోవడం సర్వసాధారణమైపోయిందని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ తన ఫేస్ బుక్ పేజీ లో ఒక పోస్ట్ లో పేర్కొంటూ,శిబిరాలకు బయలుదేరి వెళ్ళే వారికి ఈ దిగువ పేర్కొన్న భద్రత చర్యల జాబితాని అనుసరించండని సలహా ఇచ్చారు. .
ప్రయాణమయ్యే ముందు సముద్ర పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో లేదోనని, వాతావరణం సురక్షితంగా ఉన్నాయని శిబిరాలకు వెళ్ళేముందు చూసుకోవాలి ప్రయాణానికి సరైన సిద్ధపాటు మరియు అవసరమైన జాగ్రత్తలతో పాటు ఒక చక్కని ప్రణాళిక ఏర్పరుచుకోవాలని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ భద్రతా సూచనల సిఫార్సు చేసింది. ఆ సూచనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
• గుడారాలకు గుడారాలకు మధ్య దూరం 5 మీటర్ల కంటే తక్కువ దూరం ఉండకూడదు.
• వంటగది ఇతర గుడారాలకు దూరంగా ఉండాలి మరియు జెనరేటర్ మరియు పెట్రోలియం ద్రవాలు గ్యాస్ స్టవ్ గుడారాల అంచులకు దూరంగా ఉండాలి.
• గ్యాస్ సిలిండర్ ను గుడారాలకు బయట ఉంచడం మంచిది.
• అన్ని విద్యుత్ కనెక్షన్లు పైపులు ప్లాస్టిక్ రూపంలోనే ఉండాలి అలాగే భూమిలో పాతిపెట్టాలి. ప్రమాదాల పట్ల అప్రమత్తత మరియు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మరోమారు నిర్ధారించుకోండి.
• క్యాంపు లోపల లైటింగ్ అగ్నిప్రమాదాలు నివారించేందుకు గాను సురక్షితంగా అనుకూలంగా ఉండాలి.
• గుడారాలను తయారు చేయడానికి ఉపయోగించే వస్తువులు అగ్ని, వేడి మరియు లవణీయత నిరోధకంగా ఉండాలి
• ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అవసరం ఐన భద్రతా సామగ్రి (మంటలను ఆర్పే 4 కిలోల పొడి చూర్ణం , మంటలను ఆర్పే దుప్పట్లు మరియు ప్రథమ చికిత్స పెట్టె ) చూచుకొనుము సులభంగా అందుబాటులో ఉండే స్థానంలో సిద్ధంగా ఉంచుకోవాలి.
వినోద ప్రయాణాలకు క్యాంపింగ్ వేళ ఎటువంటి దురదృష్టకరమైన సంఘటనలను చోటు చేసుకోకుండా వాటిని నిరోధించడానికి ఒక పర్యవేక్షణ ,పిల్లల భద్రతకు భరోసా ఇచ్చేందుకు ఆంతరంగిక మంత్రిత్వ శాఖ విశేష ప్రాధాన్యమిచ్చారు. గుడారాలలో సురక్షిత చర్యలు తీసుకోవడం ద్వారా శిబిరాలలో ఆహ్లాదకరమైన ప్రమాదరహిత వాతావరణం కల్పించటమే తమ ప్రధాన ఉద్దేశ్యమని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







