చలి తీవ్రతకు పెరిగిన వింటర్ వేర్ అమ్మకాలు
- November 19, 2016
ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరిగింది. దాంతో ప్రజలు వింటర్ వేర్ కొనుగోళ్ళ పట్ల ఆసక్తి చూపుతున్నారు. స్వెటర్స్ మరియు జాకెట్ల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన వ్యాపారులు, మార్కెట్లో డిమాండ్‌కి తగ్గట్టుగా వాటిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పలు నిర్మాణ రంగ సంస్థలు, తమ కార్మికులకు వింటర్ వేర్ని తమతోపాటు తీసుకురావాల్సిందిగా సూచిస్తున్నారు. నైట్ షిఫ్ట్‌లో పనిచేసేవారు ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకోకుండా ఉండేందుకు వారికి ఈ సూచనలు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థలు వెల్లడించాయి. ఇండియా చైనా నుంచి పెద్ద సంఖ్యలో వింటర్ వేర్ని తీసుకొచ్చామని, జిల్లాబియా, జాకెట్స్, స్వెటర్స్, ఇన్నర్స్ మరియు వార్మ్ క్లోత్స్ ఇందులో ఉన్నాయని అయిన్ ఖాలిద్లోని షాపింగ్ కాంప్లెక్స్ సేల్స్ ఎజిక్యూటివ్ ఒకరు తెలిపారు. వినియోగదారుల్ని ఆకర్షించేందుకోసం 20 శాతం డిస్కౌంట్తోనూ మార్కెట్లో విక్రయదారులు వింటర్వేర్ని అందుబాటులో ఉంచుతున్నారు. జాకెట్స్, స్వెటర్స్ 95 ఖతారీ రియాల్స్ నుంచి 160 ఖతారీ రియాల్స్ వరకు లభ్యమవుతున్నాయి. జిల్లాబియా మరియు ఇతర వార్మ్ క్లాత్స్ 30 ఖతారీ రియాల్స్ వరకు ఉన్నాయి. పలువురు వర్తకులు వినియోగదారుల్ని ఆకర్షించేందుకు అద్భుతమైన ఆఫర్లను కూడా ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







