ఫిబ్రవరిలో 'విన్నర్'.....

- November 22, 2016 , by Maagulf
ఫిబ్రవరిలో 'విన్నర్'.....

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా 'విన్నర్' చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఈ మధ్యనే షూటింగ్ నిమిత్తం టర్కీ వెళ్లింది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను, పాటలను అక్కడ చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ పూర్తికావడంతో తదుపరి షెడ్యూల్ కోసం తిరిగివచ్చేసింది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తుండగా, అనసూయ ఐటెం సాంగ్ చేయనుంది. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com