రూ. 2000 నోట్లు అప్పుడే తీవ్రవాదుల చేతుల్లోకి..!
- November 22, 2016
నల్లధనం, తీవ్రవాదాన్ని కట్టడి చేసేందుకు పాత పెద్ద నోట్లు రద్దు చేశామన్న కేంద్ర ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. మోదీ సర్కారు కొత్తగా చెలామణిలోకి తెచ్చిన రూ. 2000 నోట్లు అప్పుడే తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. జమ్మూకశ్మీర్ బందిపోరా జిల్లాలోని హంజన్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాలు ఇద్దరు తీవ్రవాదులను హతమార్చాయి.ఘటనా స్థలం నుంచి రెండు ఏకే-47 తుపాకులు, తూటాలు, ఆయుధ సామాగ్రితో పాటు కొంత నగదును సైనికులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో వంద రూపాయల నోట్లతో పాటు కొత్తగా చెలామణిలోకి వచ్చిన 2 వేల రూపాయల నోట్లు ఉండటం చూసి సైనికులు ఆశ్చర్యానికి లోనయ్యారు.ఘటనా స్థలంలో దొరికిన రెండు రూ. 2 వేల నోట్లు అసలైనవా, నకిలీవా అనేది వెల్లడి కాలేదు. 14 రోజుల క్రితమే అందుబాటులోకి వచ్చిన 2 వేల రూపాయల నోట్లు అప్పుడే తీవ్రవాదుల చేతుల్లోకి రావడం పట్ల సైనిక వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఈ నోట్లు తీవ్రవాదుల చేతుల్లోకి ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పాత రూ. 500, రూ. వెయ్యి నకిలీ నోట్లు ముద్రించి సరిహద్దు గుండా మన దేశంలోని చొరబడుతున్న ఉగ్రవాదులకు రూ. 2 వేల నోటుతో కళ్లెం పడుతుందని కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే తాజా ఉదంతంతో అంచనాలు తల్లకిందులయ్యాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







