ఆత్మహత్య కేసులో వెలుగుచూసిన నిజాలు-దుబాయ్
- November 22, 2016
దుబాయ్: భారతదేశానికి చెందిన ఓ జంట దుబాయ్‌లో ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో భర్త మృతి చెందారు. భార్య మాత్రం అపస్మారక స్థితిలోకి వెళ్ళగా ఆమెను ఆసుపత్రికి తరలించి, వైద్య చికిత్సను అందించారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కుమార్, ఆయన భార్య ఇటీవలే తమ పిల్లల్ని తమ స్నేహితులకు అప్పగించారు. తమ ఇంట్లో పనిచేస్తున్న మెయిడ్‌ని కూడా కొద్ది రోజుల క్రితమే పంపించేసినట్లు తేలింది. కార్బన్ మోనాక్సైడ్ పాయిజన్ కారణంగా కుమార్ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. అదృష్టవశాత్తూ కార్బన్ మోనాక్సైడ్ పాయిజన్ కారణంగా కుమార్ భార్య అపస్మారకస్థితిలోకి వెళ్ళినా, వైద్య చికిత్స అందించడంతో కోలుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే కుమార్, తన భార్యతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు నిజమేనని కుమార్ సన్నిహితులు, బంధువులు చెప్పారు. పోలీసులకు, కుమార్ ఫ్లాట్‌లో సూసైడ్ లెటర్ కూడా దొరికింది. ఇంట్లో చార్‌కోల్‌ని తగలబెట్టడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్‌ని సృష్టించి కుమార్, ఆయన భార్య ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. అయితే కార్బన్ మోనాక్సైడ్ పలు రూపాల్లో తయారవుతుందనీ, వెంటిలేషన్ విషయంలో ఎవరూ అశ్రద్ధ చూపకూడదనీ, సిగరెట్ స్మోకింగ్, వెహికిల్ నుంచి వచ్చే స్మోక్ వంటి వాటితో ప్రమాదం పొంచి వుంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
--శశీంధ్రన్
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







