*అవునా*

పెదవి విప్పని దుఃఖాన్ని

భుజాన వేసుకొని నువ్వు
పగిలిన అద్దాన్ని చూస్తూ
అతకని హృదయాన్ని మోస్తూ నేను

ఎవరికి వాళ్ళం పరాయిలమై
కంటతడి పెట్టుకుంటున్న మబ్బులను మోస్తూ
మళ్ళీ మనమే

పారిపోతున్న క్షణాలను పట్టుకున్నదీ లేదు
దారి వెంబటి దొర్లిపోతున్న అడుగులను ఆపిందీ లేదు

అవునా !
ఇదంతా నిజమేనా  !!

సఖీ....
నువ్వూ
నేనూ
రెండు మనసులు జతగూడిన ప్రణయం కాదంటావా ?

*పారువెల్ల*
 

Back to Top