మొక్కజొన్న హల్వా

- November 23, 2016 , by Maagulf
మొక్కజొన్న హల్వా

కావలసిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గుజ్జు - 1 కేజీ, (కండె నుండి వొలిచిన గింజల్ని ఉడికించి మిక్సీలో వేసుకోవాలి), పాలు - 1 లీటరు, కోవా - 200 గ్రా, పంచదార - 2 కప్పులు, నెయ్యి - 2 టీ స్పూన్లు, జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌ల పలుకులు అరకప్పు, యాలకుల పొడి - అరకప్పు

తయారుచేసే విధానం: దళసరిగా ఉన్న పాత్రలో పాలతో పాటే మొక్కజొన్న గుజ్జు వేసి, పాలు ఇగిరిపోయే దాకా మరిగించాలి. అడుగంటకుండా కలుపుతుండాలి. పంచదారను కలిపి, యాలకుల పొడి వేసి 7 నిమిషాల పాటు పంచదార కరిగేదాకా గరిటతో తిప్పుతూ ఉండాలి. నెయ్యి, కోవా వేసి సన్నని సెగపైన నెయ్యి పైకి తేలేదాకా ఉంచి దించాలి. తయారైన హల్వాపైన నెయ్యిలో వేగించిన జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌లతో అలంకరిస్తే చూడ్డానికి బాగుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com