కొబ్బరి నూనెతో ఆరోగ్యానికి జరిగే మేలు....
- November 23, 2016
కొబ్బరి నూనెతో ఆరోగ్యానికి జరిగే మేలు అంతా ఇంతా కాదు. అయితే కొబ్బరి నూనెను అత్యధికులు వాడటమే లేదు. కొబ్బరి నూనె చర్మాన్ని సంరక్షించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. రోజూ తలమాడుకు కొబ్బరి నూనె రాసుకోవడం ఉత్తమం. తద్వారా చర్మం పొడిబారడం నుంచి తప్పించుకోవచ్చు. కార్యాలయాల్లో పని ఒత్తిడి కారణంగా ముఖం అందవిహీనంగా తయారవుతుంది.అయితే కొబ్బరి నూనె రాసుకోవడం ద్వారా ఒత్తిడి మటాష్ అవుతుంది. ముఖానికి ప్రత్యేక అందం చేకూరుతుంది. కొబ్బరి నూనె ద్వారా ముఖానికి మసాజ్ చేసుకుంటే ముఖ చర్మానికి ఎంతో మేలు చేకూరుతుంది. అలాగే శరీరానికి కొకొనట్ ఆయిల్ మసాజ్ ద్వారా ఒత్తిడి దూరమవుతుంది. కీళ్ళ నొప్పులు ఉండవు. టెంకాయ నూనెలో బ్యాక్టీరియాలపై పోరాడే శక్తి ఉంది. పేగులకు ఈ నూనె మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రాత్రిపూట ముఖానికి టెంకాయ నూనె రాస్తే చర్మం మృదువుగా ఉంటుంది. అందుకే కేరళలో వంటల్లోనూ కొబ్బరినూనెను ఉపయోగిస్తున్నారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







