తెలంగాణలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది
- November 23, 2016
తెలంగాణలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కొత్తది ప్రారంభించారు. ఉదయం 5గంటల 22 నిమిషాలకు శాస్త్రోక్తంగా ప్రారంభోత్సవం జరిగింది. సీఎం కేసీఆర్ సతీసమేతంగా గృహప్రవేశం చేశారు. యతిపురాణం, దైవప్రవేశం, గోవు ప్రవేశం, నివశించేవారి ప్రవేశం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి చినజీయర్ స్వామి, పలువురు మంత్రులు హాజరయ్యారు. మరికాసేపట్లో గవర్నర్ దంపతులు వెళ్లనున్నారు. తెలంగాణ సీఎం కొత్త క్యాంపు కార్యాలయానికి ప్రగతిభవన్‌గా నామకరణం చేశారు. ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయం, సమావేశ మందిరం, ప్రస్తుతం ఉన్న రెండు పాత బిల్డింగ్‌లు కలిపి ఐదు భవనాలుంటాయి. ఈ మొత్తం కాంప్లెక్స్‌ను ప్రగతిభవన్‌గా పిలుస్తారు. వివిధ వర్గాల ప్రజలతో సమాలోచనలు జరిపే మందిరానికి జనహిత భవన్ అనే పేరు పెట్టారు. విధానాల రూపకల్పన, కార్యక్రమాల అమలు, తదితర అంశాలకు సంబంధించి రైతులు, కార్మికులు, విద్యార్థులతో ఇక్కడే చర్చలు జరుపుతారు. ప్రజాహితం కోసం ప్రతి కార్యక్రమం ఇక్కడే పుడుతుందని అందుకే జనహిత అనే పేరు పెట్టారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
తాజా వార్తలు
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి







