అమితాబ్.. అక్షయ్ చిత్రం...
- November 23, 2016
బి గ్బీ అమితాబ్ యువ కథానాయకులతో పోటీపడుతూ భిన్నమైన చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమిర్‌ఖాన్‌తో కలిసి 'థగ్స్ ఆఫ్ హిందుస్తానీ' చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమితాబ్.. తాజాగా మరో సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్‌తో కలిసి నటించేందుకు ఒకే చెప్పారట.
అమితాబ్.. అక్షయ్ కలిసి గతంలో 'వక్త్: ది రేస్ అగెనెస్ట్ టైం' చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు ఇద్దరూ కలిసి నటించే అవకాశం వచ్చింది. దర్శకుడు ఆర్. బాల్కీ- అమితాబ్ బచ్చన్ మధ్య మంచి స్నేహం ఉంది. బాల్కీ దర్శకత్వం వహించిన 'చీనీకమ్'..
'పా'.. 'షామితాబ్' చిత్రాల్లో బిగ్‌బీ ప్రధాన పాత్ర పోషించారు. 'ఇంగ్లీష్ వింగ్లీష్'.. 'కీ అండ్ కా' చిత్రాల్లోనూ అమితాబ్ అతిథి పాత్రలో కన్పించారు.
ఆమిర్‌ఖాన్‌తో కలిసి నటిస్తున్న 'థగ్స్ ఆఫ్ హిందుస్థానీ' చిత్రం పూర్తయిన తర్వాత అక్షయ్-అమితాబ్ కాంబినేషన్ చిత్రం పట్టాలెక్కనుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు







