'ప్రవాసాంధ్ర తెలుగు దేశం పార్టీ--కువైట్' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన వన భోజనాలు
- November 25, 2016
ఫ్రవాసాంధ్ర తెలుగు దేశం పార్టీ కువైట్ లో ఏ కార్యక్రమం నిర్వహించినా మరే ఇతర రాజకీయ పార్టీ కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలంలో నిర్వహించలేని విధంగా వినూత్న పద్ధతిలో భారీ ఎత్తున తెలుగు దేశం పార్టీ అభిమానుల ప్రోత్సాహంతో, కార్యకర్తల అండదండలతో కార్యక్రమలను నిర్వహిస్తూ వస్తున్నది. కువైట్ లోని ప్రవాసులనందరినీ కలుపుకుపోతూ వారికి సేవనందించడమే లక్ష్యంగా పలు సాంఘిక కార్యక్రమాలను చేపడుతూ, ప్రవాసుల మన్ననలను అందుకుంటున్నది కువైట్ ప్రవాసాంధ్ర తెలుగు దేశం.
ఇప్పుడు తాజాగా జన చైతన్య యాత్ర మరియు కార్తీక మాస వనభోజన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి 400 పైచిలుకు తెలుగు ప్రవాసులు హాజరు అయ్యారు.
అందలుస్ పార్క్ రిగ్గై కువైట్ లో 25 నవంబర్ 2016 శుక్రవారం ఉదయం 9 గంటలకి జన చైతన్య యాత్ర మరియు కార్తీక మాస వనభోజన మహోత్సవాలు ఎంతో ఉత్సాహంగా మొదలయ్యాయి. తెలుగుదేశ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తునటువంటి కృషి మరియ చేపడుతున్న కార్యక్రమాల గురించి అవగాహన మరియూ త్వరలో కువైట్ పర్యటనకి వస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తో చర్చించవలసిన అంశాలు, ఆలోచనల ఆచరణల గురించి ఒక చర్చ నిర్వహించారు ప్రవాసాంధ్ర తెలుగు దేశం పార్టి . పార్టి అభిమానులు ప్రవాసాంధ్రులు ఈ వినూత్న కార్యక్రమానికి అశేష సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
విచ్చేసిన ప్రవాసులు చాలామంది ప్రవాసాంధ్ర తెలుగుదేశంలోకి చేరడం ఒక విశేషం అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ చేపడుతున్న అనేక కార్యక్రమాల గురించి ఉపన్యసించడం మరో విశేషం.
ఇక కార్యక్రమంలో హైలైట్ APNRT CEO వేమూరి రవి మధ్య ప్రాచ్య (Middle East) దేశాలకు కువైట్ ఎన్నారైస్ అధినేత చప్పిడి రాజశేఖర్ ని APNRT మీడియా కోఆర్డినేటర్ గా నియమించిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రవాసాంధ్ర తెలుగుదేశం కువైట్ శ్రీ రాజశేఖర్ చప్పిడిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చప్పిడి రాజశేఖర్ స్పందిస్తూ.. తనకు ఇచ్చినటువంటి ఈ గౌరవానికి, ఈ సత్కారానికి ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అశేష ప్రజానీకానికి, కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరిన సభ్యులకు ప్రవాసాంద్ర తెలుగుదేశం నాయకులు ములకల సుబ్బారాయుడు, పేరం రమణ, కోడూరి వెంకట్, మలేపాటి సురేష్, పెరుగు శ్రీను , K .చద్ర, వెంకటేస్, P సుదర్సన్, బాష, నారయణమ్మ యోగి, ములకల రవి, కొటి, కె.రామ కృష్ణ, M శ్రీను, శివయ్య, రాజెంద్ర, తిరుమలనాయుడు, శాంతా రామ్ మరియు కార్యవర్గం పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలియజేశారు.









తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









