గల్ఫ్ వలసలపై సమగ్ర అధ్యయనం
- November 26, 2016
గల్ఫ్ వలసలపై సమగ్ర అధ్యయనం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ న్యూ దిల్లీ, హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాయం వారు సంయుక్తంగా గల్ఫ్ వలసలపై సమగ్ర అధ్యయనం(సర్వే)కు శ్రీకారం చుట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్(చరిత్ర) అడపా సత్యనారాయణ, ప్రవాసీ మిత్ర సంస్థ అధ్యక్షుడు మంద భీంరెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం రీసెర్చి స్కాలర్ జి.సాయిక్రిష్ణ యాదవ్(గల్ఫ్ వలసలు) ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామాన్ని గురువారం సందర్శించారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో సమావేశమై గల్ఫ్ బాధితుల వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ప్రవాసి మిత్ర సంస్థ అధ్యక్షుడు మంద భీంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వయసుల వారిగా ప్రజలు ఎడారి దేశాలకు వలసవెళ్లడానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని అన్నారు. గల్ఫ్‌లో వారు పడిని ఇబ్బందులు, వేతనలేమి, ఏజెంట్ల మోసాలు తదితర అంశాలతో పూర్తిస్థాయి నివేదిక రూపొందిస్తామని అన్నారు. ఇందులో భాగంగా వెంకటాపూర్‌ను నమూనా గ్రామంగా ఎంపిక చేసుకున్నామన్నారు. త్వరలో బృందాలు ఇంటింటా సర్వే నిర్వహించి గల్ఫ్ బాధితులపై సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వాలకు అందజేస్తామని భీంరెడ్డి పేర్కొన్నారు. మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వలసలు, ఎడారి దేశాలకు బతుకుదెరువు కోసం వెళ్లడానికి గల కారణాలను జడ్పీటీసీ సభ్యుడు తోట ఆగయ్య, మంత్రి కె.తారకరామారావు వ్యక్తిగత సహాయకుడు గనరాజు బృందానికి వివరించారు. సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
--సాయి కృష్ణ యాదవ్

తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









