'తెలుగు తరంగిణి' కార్తీక వన భోజనాలు
- November 26, 2016
తెలుగు తరంగిణి వారి ఆర్ధ్వర్యంలో దుర్ముఖి నామ సంవత్సర కార్తీక వన భోజనాలు రాస్ అల్ ఖైమా సకుర్ పార్క్ లో నవంబర్ 25 న ఉత్సాహంగా జరుపుకున్నారు. సుమారు 400 మంది తెలుగువారు ఆట, పాటలతో సాంప్రదాయ తెలుగు విందు భోజనాలతో ఆనందంగా గడిపారు.
అధ్యక్షులు సురేష్ ఆర్ధ్వర్యంలో తరంగిణి సభ్యులు శోభ, రసూల్, ప్రశాంతి, తనూజ, బిందు, లక్ష్మి, లలిత, సౌజన్య, హేమ మరియు సురేందర్ ఆటల నిర్వహణ బాధ్యతలు చూసుకున్నారు. నందా, రాజేష్, రవిశంకర్, సుదర్శన్ రెడ్డి (రాక్ సిరమిక్స్), వేణు, వెంకీ, కిరణ్, శ్రీనివాస్, వీర, భాస్కర్, మోహన్, సైద రెడ్డి,నళిని మరియు ఇతర సభ్యులు కార్యక్రమ ఏర్పాట్లు చూసుకున్నరు. సుజన్, మైథిలి ఏంకర్లుగా వ్యవహరించారు.
సినర్జీ కంట్రోల్స్ (వంశీక్రిష్ణ ), మద్రాస్ గ్రొసెరీ, మలబార్ గొల్ద్, జొయ్ అలూకాస్ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగా, APNRT యు.ఏ.ఈ కో-ఆర్డినేటర్స్ వొబ్బిలిసెట్టి అనూరాధ , శ్రీకాంత్ చిత్తర్వు, ముక్కు తులసి కుమార్ పాల్గొని APNRT Membership నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు .
తెలుగు తరంగిణి తదుపరి కార్యక్రమం " సంక్రాంతి సంబరాలు" 13 జనవరి 2017 న ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియచేసారు.
















తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









