హాంకాంగ్ ఫైనల్‌కు 'సింధు'
- November 26, 2016
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు తన అద్భుతమైన ఆటతీరుతో దూసుకుపోతోంది. చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ కైవసం చేసుకొన్న వారం రోజుల్లోపే రెండో సూపర్ సిరీస్ ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. హాంకాంగ్ సూపర్ సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఈ ఒలింపిక్ రజత పతక విజేత.. ప్రత్యర్థి క్రీడాకారిణి, స్థానిక ఫేవరెట్ చెంగ్ నగన్ యిని 21-14, 21-16తో చిత్తు చేసింది. .
దూకుడు మంత్రం
సెమీస్‌లో సింధు అత్యంత దూకుడుగా ఆడింది.
రెండు గేములను అనాయాసంగా కైవసం చేసుకొంది. స్కోర్ 2-2తో ఉండగా చెంగ్ 5-4తో ముందుకెళ్లింది. వెంటనే పుంజుకొన్న సింధు 11-9తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 15-11తో మరింత ముందుకెళ్లి 21-14తో తొలిగేమ్ గెలుచుకొంది.
రెండో గేమ్‌లో చెంగ్ ప్రతిఘటించడంతో సింధు 11-10తో స్వల్ప ఆధిక్యం సాధించింది. వెంటనే 15-12తో దూసుకుపోయింది. 17-14 నుంచి 21-16తో రెండో గేమ్ కైవసం చేసుకొని ఫైనల్లో అడుగు పెట్టింది. టైటిల్ పోరులో సింధు..
తైజు ఇంగ్‌తో తలపడనుంది. మహిళలు, పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారతీయులు తలపడుతుండటం గమనార్హం.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







