రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5
- November 27, 2016
నేపాల్ లో సోమవారం భూకంపం సంభవించింది. ఉదయం 5గంటల సమయంలో సోలుకుంబు జిల్లాలోని ఎవరెస్టు ప్రాంతం కేంద్రంగా భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ పేర్కొంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైనట్లు చెప్పింది. 2015 ఏప్రిల్ లో భారీ భూకంపం వచ్చిన తర్వాత నేపాల్ లో తరచూ భూమి కంపిస్తూ వస్తోంది.ఇప్పటివరకూ 4 కంటే ఎక్కువ భూకంప తీవ్రతతో భూమి కంపించడం ఇది 475వ సారి. కాగా, సోమవారం సంభవించిన భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







