బినామీ చట్టాన్ని తెస్తాం--ప్రధాని మోదీ
- November 28, 2016
దేశ చరిత్రలోనే అత్యంత కఠినమైన బినామీ చట్టాన్ని తెస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇది ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉందని, త్వరలో చట్టంగా అమలులోకి తెస్తామని ఆయన చెప్పారు. బినామీ ఆస్తులను కూడగట్టేవారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ చట్టానికి ఒకసారి పట్టుబడితే తీవ్రమైన శిక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని కూడా వార్నింగ్ ఇచ్చారు. 'మన్ కీ బాత్'లో భాగంగా మాట్లాడిన ఆయన.. నోట్ల రద్దుతో కొన్ని సమస్యలొస్తాయని ముందే చెప్పానని, అయితే ప్రజలు ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారని తెలిపారు.
ప్రతి వ్యక్తీ సాధ్యమైనన్ని ఎక్కువ చెల్లింపులను నగదురహితంగా చేయాలని, టెక్నాలజీ అభివృద్ది చెందుతున్న ఈ రోజుల్లో చిల్లర పేమెంట్లకు కూడా కార్డులనే వాడడం బెటరని మోదీ పేర్కొన్నారు.చిన్న షాపుల్లోనూ స్వైపింగ్ మెషిన్లు వస్తున్నాయని గుర్తు చేశారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలకు ఆర్ధిక సేవలందిస్తున్న తపాలా, బ్యాంకు ఉద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆయన ప్రశంసించారు. నల్లదన కుబేరుల ఆటలు ఇక సాగవు అని మళ్ళీ హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







