మౌంటేన్ డ్యూకు యాడ్ షూట్లో అఖిల్‌..

- November 29, 2016 , by Maagulf
మౌంటేన్ డ్యూకు  యాడ్ షూట్లో అఖిల్‌..

అక్కినేని అఖిల్ తన తొలి సినిమా వచ్చి ఏడాది అయిన తరువాత రెండో సినిమాను మొదలు పెడుతున్నారు. ఈ మధ్య తన రెండో సినిమా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 9న తను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం జరిగాక.. తరువాతి వారంలో సినిమా షూట్‌ను మొదలుపెడతారట. కానీ తాజాగా తను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మౌంటేన్ డ్యూకు ఓ యాడ్ షూట్ చేశారట. దీనికోసం మడ్ ఐలాండ్ వెళ్లిన అఖిల్ మౌంటేన్ డ్యూ యాడ్ డిజైన్ చేసిన టీమ్‌తో పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పాడు. ఓ మంచి యాక్షన్ సీన్‌తో ఈ యాడ్ ఉంటుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com