ప్రమోషన్‌ ఆఫర్స్‌: ఛార్జీల్లో 30 శాతం డిస్కౌంట్‌

- November 29, 2016 , by Maagulf
ప్రమోషన్‌ ఆఫర్స్‌: ఛార్జీల్లో 30 శాతం డిస్కౌంట్‌

ఖతార్‌ ఎయిర్‌ వేస్‌, కలిసి ప్రయాణించండి - కలిసి ఆదా చేయండి అనే కాన్సెప్ట్‌తో 30 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. ఫస్ట్‌, బిజినెస్‌, ఎకానమీ క్లాసుల్లో ఈ డిస్కౌంట్‌ చెల్లుబాటవుతుంది. గ్రూపులుగా ప్రయాణించేవారి కోసం ఈ ప్రమోషనల్‌ ఆఫర్స్‌ ప్రకటించింది ఖతార్‌ ఎయిర్‌ వేస్‌. ముగ్గురు నుంచి తొమ్మిది మంది వరకూ గ్రూపులుగా ప్రయాణిస్తే, వారికి ఈ ఆఫర్‌ వర్తించనుంది. డిసెంబర్‌ 5 వరకు బుకింగ్స్‌ చేసుకునేవారికి జూన్‌ 1 వరకు డిస్కౌంట్‌ ఆఫర్‌తో ప్రయాణించే వీలుందని ఓ ప్రకటనలో పేర్కొంది ఖతార్‌ ఎయిర్‌ వేస్‌. కిడ్స్‌ ఫ్లై ఫ్రీ అనే ఆఫర్‌ని కూడా ఖతార్‌ ఎయిర్‌ వేస్‌ ప్రకటించింది. అలాగే ఫ్లైట్‌ పర్ఛేజెస్‌పై డబుల్‌ క్యు మైల్స్‌ని కూడా అందించనున్నారు. అలాగే ట్రావెలింగ్‌ టుగెదర్‌ పేరుతో సోషల్‌ మీడియా కాంపిటీషన్‌ని కూడా ప్రారంభించింది. గెలిచినవారిలో నలుగుర్ని ఎంపిక చేసి, ఎయిర్‌లైన్‌ గ్లోబల్‌ నెట్‌వర్క్‌లో ప్రయాణించే అవకాశం కల్పిస్తారు. పార్టిసిపెంట్లు గ్రూప్‌ ఫొటోగ్రాఫ్‌ని ఖతార్‌ ట్రావెల్‌ టుగెదర్‌ హాష్‌టాగ్‌తో జత చేయాల్సి ఉంటుంది. ప్రయాణీకులు మరిన్ని వివరాల కోసం ఖతార్‌ ఎయిర్‌ వేస్‌ వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com