ప్రమోషన్ ఆఫర్స్: ఛార్జీల్లో 30 శాతం డిస్కౌంట్
- November 29, 2016
ఖతార్ ఎయిర్ వేస్, కలిసి ప్రయాణించండి - కలిసి ఆదా చేయండి అనే కాన్సెప్ట్‌తో 30 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఫస్ట్, బిజినెస్, ఎకానమీ క్లాసుల్లో ఈ డిస్కౌంట్ చెల్లుబాటవుతుంది. గ్రూపులుగా ప్రయాణించేవారి కోసం ఈ ప్రమోషనల్ ఆఫర్స్ ప్రకటించింది ఖతార్ ఎయిర్ వేస్. ముగ్గురు నుంచి తొమ్మిది మంది వరకూ గ్రూపులుగా ప్రయాణిస్తే, వారికి ఈ ఆఫర్ వర్తించనుంది. డిసెంబర్ 5 వరకు బుకింగ్స్ చేసుకునేవారికి జూన్ 1 వరకు డిస్కౌంట్ ఆఫర్‌తో ప్రయాణించే వీలుందని ఓ ప్రకటనలో పేర్కొంది ఖతార్ ఎయిర్ వేస్. కిడ్స్ ఫ్లై ఫ్రీ అనే ఆఫర్‌ని కూడా ఖతార్ ఎయిర్ వేస్ ప్రకటించింది. అలాగే ఫ్లైట్ పర్ఛేజెస్పై డబుల్ క్యు మైల్స్‌ని కూడా అందించనున్నారు. అలాగే ట్రావెలింగ్ టుగెదర్ పేరుతో సోషల్ మీడియా కాంపిటీషన్‌ని కూడా ప్రారంభించింది. గెలిచినవారిలో నలుగుర్ని ఎంపిక చేసి, ఎయిర్‌లైన్ గ్లోబల్ నెట్‌వర్క్‌లో ప్రయాణించే అవకాశం కల్పిస్తారు. పార్టిసిపెంట్లు గ్రూప్ ఫొటోగ్రాఫ్‌ని ఖతార్ ట్రావెల్ టుగెదర్ హాష్‌టాగ్‌తో జత చేయాల్సి ఉంటుంది. ప్రయాణీకులు మరిన్ని వివరాల కోసం ఖతార్ ఎయిర్ వేస్ వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!







