ఒమాన్‌లో అదిక ఉష్ణోగ్రతలు - పొడిగించాల్సిన మధ్యాహ్న విరామం
- September 01, 2015
ఒమాన్ లో ఇంకా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా వందల సంఖ్యలో శ్రామికులు ఆసుపత్రుల ముందు క్యూ లు కడుతున్న నేపధ్యంలో, మధ్యాహ్న విరామాన్ని మరికొంత కాలం పొడిగించాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ సంవత్సరం ఇంచుమించు 25 శాతం కేసులు అధికంగా నమోదయ్యాయని వైద్యులు చెపుతుండగా, ఈ అధిక ఉష్ణోగ్రతలు కనీసం ఈ నెల మధ్యవరకు ఐనా ఉంటాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. మధ్యాహ్నo 12.30 నుండి 3.30 వరకు ఉం డే ఈ మధ్యాహ్న విరామం, జూన్ 1 నుండి మొదలై, ఈ ఆదివారం ముగిసిన సంగతి తెలిసిందే! ఇది ఇలా ఉండగా, ఈ మండుటెండలో, చమురు క్షేత్రాల్లోనూ, ఇతర కర్మాగారాల్లోనూ పనిచేసే కార్మికుల గతి వర్ణనా తీ తమని, ఇంత తీవ్ర పరిస్థితిలో శ్రామికుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టరాదని, పెట్రో లియం డెవెలప్ మెంట్ ఒమాన్ ట్రేడ్ యూనియన్ మరియు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ యూనియన్స్ ఛైర్మన్ సౌడ్ సాల్మి, ఇంకా ఇతర యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.
--లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







