"యు ఏ ఈ" లో 700 మంది శ్రామికులకు నాణ్యత గల దంత వైద్యం

- September 01, 2015 , by Maagulf

దుబాయ్ యువరాజు షేక్ హందాన్ బిన్ మొహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వారిచే మే 2015 లో ప్రారoభించబడిన ‘హందాన్ బిన్ మొహమ్మద్ ఓరల్ హైజీన్ ' పధకంలో ఇప్పటిదాకా ఇంచుమించు 700 మందికి  శ్రామికులకు పరీక్షలు జరిపి, వారిలో 500 మందికి చికిత్సను సూచించారు. ఈ సంవత్సరాంతానికి పూర్తికానున్న  మొదటిదశ లో 2000 మంది శ్రామికులకు దంతవైద్య సేవలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. భాగస్వాములతో పాటు, శ్రామికులకు కూడా ప్రయోజనం కలిగేలా, ఇన్సూరెన్స్ చే కవర్ చేయబడనిదయిన, ఖరీదైన దంతవైద్యాన్ని అందిస్తున్నామని యువరాజు కార్యాలయం యొక్క డైరక్టర్ జనరల్ సైఫ్ బిన్ మార్ఖన్ అల్ కెత్బి తెలిపారు. దుబాయి శ్రామిక వ్యవహారాల శాశ్వత కమిటీ అధ్యక్ష్యులైన మేజర్ జనరల్ ఒబైడ్ మొహైర్ బిన్ సురూర్ - సమాజంలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా, దంత సంరక్షణ యొక్క స్థాయిని కూడా పెంచాలని తాము ఆశిస్తున్నట్టు తెలిపారు.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com