పోలీసులపై కాల్పులు: ముగ్గురికి మరణ శిక్ష
- December 01, 2016
జెడ్డా: రియాద్‌లోని స్పెషల్ క్రిమినల్ కోర్టు, ముగ్గురు సౌదీలకు మరణ శిక్ష విధించింది. పోలీస్ పెట్రోల్‌పైనా, ఖాతిఫ్ ప్రిజన్‌పైనా కాల్పులు జరిపిన నేరంలో వీరికి ఈ మరణ శిక్షను విధించడం జరిగింది. ఈ కేసులో మరో వ్యక్తికి 12 ఏళ్ళ జైలు శిక్షను విధించింది. పోలీసులపై కాల్పులు జరపడం, ప్రభుత్వ భవనాలపై దాడులు చేయడం, అలాగే వెపన్స్‌ని సముద్ర మార్గం ద్వారా స్మగ్లింగ్ చేయడం తదితర కేసుల్లో నాలుగో వ్యక్తి నిందితుడు. మొదటి నిందితుడు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు తేల్చిన న్యాయస్థానం ఆ నిందితుడి చర్యల్ని తీవ్రంగా ఖండించింది. మెషీన్ గన్లతోనూ, పిస్టోళ్ళతోనూ దాడులు చేయడం దుర్మార్గమని న్యాయస్థానం ఆగ్రహించింది. దేశంలోకి అక్రమంగా ఆయుధాల్ని తీసుకొచ్చి, వాటిపై కొందరికి శిక్షణ ఇప్పించినట్లు నిందితుడిపై నేరారోపణలు నిరూపించబడ్డాయి. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడేందుకుగాను కొందరిని కింగ్‌డమ్‌లోకి అక్రమంగా నిందితుడు తీసుకువచ్చినట్లు విచారణలో తేలింది. రెండో నిందితుడు, మూడో నిందితుడిపైన కూడా ఇవే తరహా నేరాలు నిరూపించబడ్డాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







