మైగ్రెంట్ వర్కర్స్ కోసం ఎగ్జిట్ రూల్స్ సరళతరం
- December 01, 2016
2015 డిసెంబర్ 13 కొత్త చట్టం 21 అమల్లోకి రావడం ద్వారా ఖతార్‌లో 2.1 మిలియన్ సేలరీడ్ వర్క్ ఫోర్స్‌లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. కొత్త విధానం, అప్పటిదాకా అమల్లో ఉన్న ఖఫాలా సిస్టమ్‌ని రీప్లేస్ చేసింది. అధునాతనమైన కాంట్రాక్ట్ బేస్డ్ విధానం అమల్లోకి వచ్చింది. కొత్త చట్టం ప్రకారం విదేశీ వర్కర్స్, దేశాన్ని విడిచిపెట్టేందుకుగాను యజమానికి సమాచారం అందిస్తే సరిపోతుంది. కాంట్రాక్ట్ ముగసిన తర్వాత లేదా కాంట్రాక్ట్ ఉండగానే పర్మనెంట్‌గా దేశం విడిచిపోవడానికి కార్మికులకు వెసులుబాటు కలిగింది. ఒకవేళ యజమాని తిరస్కరిస్తే, మైగ్రెంట్ వర్కర్ తన ఎగ్జిట్ పర్మిట్ కోసం గ్రీవెన్సెస్ కమిటీని సంప్రదించవచ్చు. మూడు రోజుల్లోపే ఆ కమిటీ వర్కర్ ఫిర్యాదుపై స్పందిస్తుంది. ఈ మూడు రోజుల్లో ఆ వర్కర్ ఏమైనా నేరాలకు పాల్పడ్డాడా? అనే అంశాలపై కమిటీ పరిశీలిస్తుంది. అవేమీ లేవని తేలితే, ఎగ్జిట్ పర్మిట్ లభిస్తుంది. ఎగ్జిట్ పర్మిట్ గ్రీవెన్సెస్ కమిటీలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్‌మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్, అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు ఉంటారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







