యూఏఈ అమరవీరులకు పర్మనెంట్ మెమోరియల్
- December 01, 2016
అబుదాబీ: దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకునేందుకు, వారిని గౌరవించుకునేందుకోసం ప్రత్యేకంగా వహత్ అల్ కరామా (ఒయాసిస్ ఆఫ్ డిగ్నిటీ) మెమోరియల్ సైట్‌ని అబుదాబీలో కమ్మెమరేషన్ డే సందర్భంగా ప్రారంభించారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ గత ఏడాది ఈ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిర్మాణం ఈ ఏడాది మార్చ్‌లో ప్రారంభమయ్యింది. షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ సమీపంలో దీన్ని నిర్మించారు. ఇది దేశంలో కల్చరల్ ల్యాండ్ మార్క్‌గా ప్రసిద్ధిగాంచనుంది. 42,000 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ మెమోరియల్ సైట్ పెవిలియన్, హానర్ మరియు మొమోరియల్ మాన్యుమెంట్‌ని కలిగి ఉంటుంది. పెవిలియన్ ఆఫ్ హానర్‌లో 196 మంది ఎమిరేటీ అమరవీరులకు సంబంధించిన పేర్లను, వారి వివరాలను గోడలపై పొందుపరిచారు. పెవిలియన్ రూఫ్ ఎనిమిది ప్యానల్స్‌తో రూపొందించారు. మెమోరియల్ మాన్యుమెంట్‌ని బ్రిటిష్ ఆర్టిస్ట్ ఇద్రిస్ ఖాన్ డిజైన్ చేశారు. యూఏఈ భావజాలాన్ని ఇక్కడ పొందుపరిచారు. మెమోరియల్ ప్లాజా అతి విశాలమైన ప్రాంతం. ఇక్కడే కమ్మెమరేషన్ డే జరుగుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







