పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన 'కమ్యునిస్ట్'లు
- December 01, 2016
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సీపీఐ నేతలు భేటీ కావడం ఆసక్తిగా వుంది. సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రావు తదితరులు కొద్దిసేపటి క్రితం పవన్‌తో భేటీ అయ్యారు. తాజగా రాజకీయ పరిణామాలు, ఎపీకి స్పెషల్ స్టేటస్, పెద్దనోట్ల రద్దు సహా ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇటివలే పవన్ కళ్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా ముగిసిపోయిన కధ చెబుతున్న కేంద్రాన్ని తగిన బుద్ది ప్రజలు చెబుతారని హెచ్చరించారు పవన్. అలాగే, మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు పై కూడా ఒక్కింత అసహనం వ్యక్తం చేశారు. సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఈ నిర్ణయాన్ని తీసుకొని గంధర గోళం చేశారని అభిప్రాయపడ్డారు పవన్. ఈ ఇలాంటి నేపధ్యంలో ఆయన సీపీఐ నేతలతో భేటీ కావడం ఒక్కింత ఆసక్తిగా మారింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







