తెలంగాణ రాష్ట్రానికి రిజర్వు బ్యాంకు నుంచి రూ.1,600 కోట్ల నగదు..
- December 01, 2016
తెలంగాణలో నగదు సమస్య కొంతవరకూ పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి రిజర్వు బ్యాంకు నుంచి రూ.1,600 కోట్ల నగదు రానున్నట్లు సమాచారం. ఈమేరకు గురువారం ఆర్‌బీఐ నుంచి ఆర్థికశాఖకు సమాచారం అందింది. ఒకటో తేదీ వచ్చేయడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరికీ నగదు అవసరం బాగా పెరిగింది. సొమ్ము బ్యాంకు ఖాతాల్లో ఉన్నా దాన్ని పొందలేని పరిస్థితి. ఉద్యోగులకు, పింఛనుదార్లకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున నగదు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరటంతో ఇప్పుడు బ్యాంకులపై మరింత ఒత్తిడి పెరిగింది.తెరుచుకోనున్న ఏటీఎంలు: నగదు అందుబాటులోకి వచ్చినట్లైతే ఉద్యోగులకు, పింఛనుదార్లకు రూ.10వేల చొప్పున లభించడంతో పాటు ఏటీఎంలు తెరుచుకొనే అవకాశముంటుంది. రాష్ట్రంలో గురువారం అత్యధిక ఎటీఎంలను తెరవనేలేదు. తెలంగాణ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు బుధ,గురువారాల్లో బ్యాంకుల అధికారులతో భేటీ అయి నగదు లభ్యతపై చర్చించినట్లు తెలిసింది. సమస్యలను ఆర్‌బీఐకి నివేదించడంతో రాష్ట్రానికి శుక్రవారం రూ.1600 కోట్లు నగదును పంపుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.జీతాలు, పింఛన్లు పొందేవారు హైదరాబాద్‌లో ఎక్కువగా ఉన్నందున రూ.600 కోట్లను ఇక్కడి బ్యాంకులకు అందజేస్తారు. మిగతా రూ.వెయ్యి కోట్లు జిల్లాల బ్యాంకులకు వెళ్తాయి. తొలిరోజు రూ.10వేల చొప్పున పొందడంలో సమస్యలు తలెత్తడంపై జిల్లాల నుంచి సర్కారుకు ఫిర్యాదులందాయి. తొలిరోజు ఎందరు ఉద్యోగులకు ఎంతమేర నగదును ఇచ్చిందీ తెలపాల్సిందిగా సర్కారు బ్యాంకులను కోరినట్టు తెలిసింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







