పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గుదల

- December 02, 2016 , by Maagulf
పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గుదల

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పెట్రోలు మరియు డీజిల్‌ ధరల్ని డిసెంబర్‌ నెల కోసం ప్రకటించింది. ఈ ప్రకటనలో ధరల్ని తగ్గిస్తున్నట్లు పేర్కొంది. సూపర్‌ గ్రేడ్‌ ఫ్యూయల్‌ - మోగాస్‌ 95, 7 బైజాజ్‌ తగ్గి 176 బైజాజ్‌కి చేరుకుంది. న్యూ గ్రేడ్‌ పెట్రోల్‌ మోగ్యాస్‌ 91 - 8 బైజాజ్‌ తగ్గి 165 బైజాజ్‌కి చేరుకుంది. డీజిల్‌ ధరల విషయానికొస్తే 10 బైజాజ్‌ తగ్గి 177 బైజాజ్‌కి చేరుకుంది. నవంబర్‌లో మోగాస్‌ 95 ధర 183 బైజాజ్‌గా ఉంది. మోగాస్‌ 91 ధర 173 బైజాజ్‌గా ఉండగా, డీజిల్‌ ధర 187 బైజాజ్‌గా ఉండేది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com