డ్రగ్స్‌ స్మగ్లింగ్‌: ఇద్దరికి ఐదేళ్ళ జైలు శిక్ష

- December 02, 2016 , by Maagulf
డ్రగ్స్‌ స్మగ్లింగ్‌: ఇద్దరికి ఐదేళ్ళ జైలు శిక్ష

మనామా: ఇద్దరు నిందితులకు డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కేసులో ఐదేళ్ళ జైలు శిక్ష ఖరారయ్యింది. ఆ ఇద్దరిలో ఒకరు థాయి మహిళ కాగా, మరొకరు బహ్రెయినీ వ్యక్తి. తమ బ్యాగ్‌ హ్యాండిల్స్‌లో డ్రగ్స్‌ని దాచి, దేశంలోకి అక్రమంగా వాటిని తీసుకొచ్చినట్లు నేరం నిరూపణ అయ్యింది. యాంటీ నార్కోటిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ - మినిస్ట్రీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌కి అందిన సమాచారం నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్‌ జరిగింది. ఐదేళ్ళ జైలు శిక్షతోపాటు 3000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా ఒక్కొక్కరికి విధించడం జరిగింది. థాయి మహిళకు అదనంగా 100 బహ్రెయినీ దినార్ల జరీమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com