ఇకపై పెళ్లి చదివింపులకి సరికొత్త ఆలోచన!
- December 04, 2016
నల్లధనాన్ని నిర్మూలించి, నగదు రహిత సమాజం దిశగా అడుగులు వేసేందుకు ప్రతీ ఒక్కరూ ఈ-వ్యాలెట్, ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయాలను ఉపయోగించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అవగాహన కల్పించేందుకు దిల్లీ పోలీసు ఒకరు తన వివాహాన్నే వేదిక చేశారు. అంబేడ్కర్ నగర్ పోలీస్స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సందీప్కుమార్కు శనివారం వివాహమైంది. ఈ వివాహానికి హాజరైన సందీప్ సహోద్యోగులు పెళ్లికి ఇచ్చే షగున్(చదివింపులు)ను ఈ-వ్యాలెట్, బ్యాంకుల యాప్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. దాదాపు 15 మందికి పేటీఎం, ఎస్బీఐ బడ్డీ, యాక్సిస్ బ్యాంకు తదితర యాప్ల ద్వారా సందీప్ అకౌంట్కు నగదు ట్రాన్స్ఫర్ చేసినట్లు దక్షిణ దిల్లీ డిప్యూటీ కమిషనర్ రోమిల్ బానియా తెలిపారు. ప్రతీ ఒక్కరూ చెల్లింపులను మొబైల్ వ్యాలెట్, నెట్బ్యాంకింగ్ల ద్వారానే చేయాలని దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని దిల్లీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ వర్మ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







