'అమ్మ' క్షేమమేనా?
- December 04, 2016
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను మళ్లీ ఐసీయూలో చేర్పించారు. సాధారణ వార్డులో చికిత్స పొందుతున్న జయలలితకు గుండెపోటు రావడంతో ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో జయలలితకు చికిత్స అందిస్తున్నారు. మరో వైపు ఆదివారం జయలలిత పూర్తిగా కోలుకున్నారని ఎయిమ్స్ వైద్య నిపుణులు నిర్ధారించారని ఆ పార్టీ నేతలు చెప్పారు. త్వరలో జయలలిత డిశ్చార్జి అయి ఇంటికి వెళతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతలోనే మళ్లీ జయలలితకు గుండెపోటు వార్త రావడంతో పెద్ద మొత్తంలో కార్యకర్తలు ఆసుపత్రి దగ్గరకు చేరుకుంటున్నారు. సమాచారం తెలియగానే గవర్నర్ విద్యాసాగర్ రావు హుటాహుటిన ముంబై నుంచి చైన్నైకి బయలుదేరారు. మధురైలో అత్యవసర సమావేశాన్ని రద్దు చేసుకుని డీజీపీ రాజేంద్రన్ చైన్నై బయలుదేరి వెళ్లారు. అపోలో ఆసుపత్రి వద్ద భారీగా భద్రత పెంచారు. సెప్టెంబర్ 22 నుంచి అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







