హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు సజీవదహనం
- December 04, 2016
పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ అదుపుతప్పిన ఆల్టోకారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో కారులో ఉన్న నలుగురు సజీవదహనం అయ్యారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ టీఎస్ 03 ఈఎల్ 6551గా గుర్తించారు. మృతులంతా వరంగల్ జిల్లా పరకాలకు చెందినవారిగా సమాచారం. సంధ్యల రాజేశ్వరి పేరు మీద ఈ కారు రిజిస్ట్రేషన్ అయ్యింది. శంషాబాద్ నుంచి ఘట్ కేసర్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







