కువైట్ ఎన్నారైస్ అధినేత చప్పిడి రాజ శేఖర్ ను వరించిన ప్రవాసి ఎక్స్ లెన్స్ అవార్డ్-2016
- December 05, 2016
కోయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణా అసోసియేషన్స్ - కోట (విదేశీ తెలంగాణ సంఘాల సంకీర్ణం) మరియు ప్రవాసిమిత్రమాసపత్రిక సంయుక్తఆధ్వర్యంలో 18 డిసెంబర్ 2016 ఆదివారం హైదరాబాదులోని పొట్టిశ్రీరాములు తెలుగు యునివర్సిటీ ఆడిటోరియంలో ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే (అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం నిర్వహించనున్నారు. దేశంకాని దేశంలో పోటీతత్వం నైపుణ్యం, సామర్ధ్యంతో పాటు మానవతా దృక్పధంతో అందించిన సేవలను గుర్తించి ప్రవాస భారతీయ సంతతికి ప్రవాసీ ఎక్స్లెన్స్ అవార్డ్ 2016 బహుకరించి సత్కరిస్తారు. తమ తమ రంగాలలో విశేష ప్రతిభ కనపరచిన ప్రవాస భారతీయ సంతతికి చెందినా స్త్రీ పురుషులు భారత దేశంలోనే ఏ ప్రాంతానికి చెందినవారైనా ఈ పురస్కారానికి అర్హులే. అలాంటి ఈ ప్రవాసీ ఎక్స్ లెన్స్ అవార్డు లో భాగంగా www.kuwaitnris.com అధినేత చప్పిడి రాజ్ శేఖర్ గారు మీడియా మరియు వాలంటరీ సర్వీసెస్ విభాగం లో ఎంపికయ్యారు. 11 భాషలలో వెలువడుతున్న అంతర్జాతీయ పత్రిక కువైట్ ఎన్నారైస్, ఈ పత్రిక ద్వారా కువైట్ లోని అన్ని తెలుగు సామాజిక, సాంస్కృతిక సంఘాలని ఒకటి చేసి అక్కడి తెలుగు వారి కష్టాలని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, కువైట్ భారత ఎంబసీ దృష్టికి తీసుకువస్తూ సత్వర చర్యలు తీసుకునే విధంగా కువైట్ ఎన్నారైస్ ద్వారా శ్రీ రాజ్ శేఖర్ గారు అవిరళ కృషి చేస్తున్నారు. ఇటీవల స్వదేశానికి వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కువైట్ ఎన్నారైస్ డైరెక్టర్ చప్పిడి రాజశేఖర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గారి తో పాటు ఎంతో మంది ఉన్నతాధికారులను కలిసి కువైట్ లోని తెలుగువారి కష్టాలని వివరించారు.
ఉన్న ఊళ్ళో ఉద్యోగాలు కరువై, వచ్చిన ఉద్యోగాలకి ఇచ్చే ఆ జీతాలు చాలక ఉన్న ఊరుని, దేశాన్ని వదులుకుని గల్ఫ్ దేశాలకి వెళ్ళి అక్కడ చేసే ఉద్యోగాలకి యజమానులనుండి జీతాలు లేక, తీసుకున్న పాస్పోర్ట్ తిరిగి ఇవ్వక ఎంతోమంది తెలుగువాళ్ళు కువైట్ లో కష్టాలు పడుతున్నారని, అలాగే ఈ గల్ఫ్ సమస్యలన్నీటికీ పరిష్కారం గల్ఫ్ లో కష్టపడుతున్న లక్షలమంది తెలుగువారికి అండ కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి వారి కష్టాలపై దృష్టి సారిస్తేనే సత్వరం పరిష్కరించగలమని రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిని అభ్యర్ధించారు. ఇలా తెలుగు వారికి చేస్తున్న సహాకారానికి గాను ప్రపంచ దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులందరికీ APNRT ని మరింత దగ్గర చేసి, సత్వర సేవలను అందించాలనే మహాసంకల్పం తో విదేశాలలో APNRT ప్రతినిధులను నియమిస్తున్నారు. అందులో భాగంగానే APNRT CEO వేమూరి రవి గారు మధ్య ప్రాచ్య (Middle East) దేశాలకు కువైట్ ఎన్నారైస్ అధినేత చప్పిడి రాజశేఖర్ గారిని APNRT మీడియా కోఆర్డినేటర్ గా నియమించారు.
ఈ సేవలని, కువైట్ ఎన్నారైస్ ద్వారా ప్రవాస తెలుగు వారిని ఒక్క తాటి పై నిలుపుతున్న కువైట్ ఎన్నారైస్ డైరెక్టర్ శ్రీ రాజ్ శేఖర్ సేవలకి గాను కోయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణా అసోసియేషన్స్ - కోట (విదేశీ తెలంగాణ సంఘాల సంకీర్ణం) మరియు ప్రవాసిమిత్రమాసపత్రిక సంయుక్తఆధ్వర్యంలో 18 డిసెంబర్ 2016 ఆదివారం హైదరాబాదులోని పొట్టిశ్రీరాములు తెలుగు యునివర్సిటీ ఆడిటోరియంలో ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే సందర్భంగా ప్రవాసీ ఎక్స్లెన్స్ అవార్డ్ 2016 బహుకరించి సత్కరించానున్నారు.


తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







