దుబాయ్ బస్ క్రాష్: ఐదుగురి మృతి
- December 05, 2016
దుబాయ్: బస్సు, ట్రక్కు ప్రమాదానికి గురి అయిన ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా, నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. దుబాయ్‌లోని అల్ గర్‌హౌడ్ డైరెక్షన్‌లో అల్ రబాత్ స్ట్రీట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో 20 మంది కార్మికులు వెళుతున్నారు ప్రమాదం జరిగిన సమయంలో. ఉదయం 5 గంటలకు ప్రమాదం జరిగినట్లు అల్ రషిదియా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ సయీద్ హమాద్ బిన్ సులైమాన్ చెప్పారు. ప్రమాద ఘటన గురించిన సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాల్ని పంపించినట్లు అధికారులు తెలిపారు. నలుగురు ప్రమాద స్థలంలోనే చనిపోగా, ఒకరు ఆసుపత్రిలో మృతి చెందారు. నలుగురు గాయపడగా, అందులో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ట్రక్‌ని వెనకనుంచి బస్ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ట్రాఫిక్ పోలీస్, దుబాయ్ పోలీస్, రెస్క్యూ మరియు అంబులెన్స్ సర్వీసులు సకాలంలో ప్రమాద ఘటనపై స్పందించాయి. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ పాటించడమొక్కటే మార్గమని బ్రిగేడియర్ బిన్ సులైమాన్ చెప్పారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







