స్వదేశానికి వెళ్ళేందుకు దిక్కుతోచని స్థితిలో..
- December 05, 2016
మనామా: ఇమ్మాన్యుయేల్ అనే ఘనియన్ జాతీయుడి దయనీయ గాధ ఇది. ఆయన తన కుమారుడు పుట్టినప్పుడు కూడా స్వదేశానికి వెళ్ళలేకపోయాడు. దురదృష్టవశాత్తూ తన కుమారుడు మరణించినా, చూడ్డానికి వెళ్ళలేకపోయాడు. కారణం పేదరికం. తన పేదరికం కారణంగా స్పాన్సరర్ వద్ద ఇరుక్కుపోయిన ఆ వ్యక్తి రెండేళ్ళ తర్వాత తన స్వదేశానికి వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ, ఇప్పటికీ స్పాన్సరర్ కరుణించడంలేదు. 2014లో బహ్రెయిన్‌కి వచ్చిన ఇమ్మాన్యుయేల్, మూవింగ్ సర్వీస్ కంపెనీలో చేరాడు. ఆగస్ట్ 15న కాంట్రాక్ట్ ముగిసినా, స్పాన్సరర్ మాత్రం ఇంకా అదే కంపెనీలో పనిచేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నాడు. పాస్‌పోర్ట్ ఇవ్వకుండా వేధిస్తున్నాడు. మైగ్రెంట్ వర్కర్స్ ప్రొటెక్షన్ సొసైటీ (ఎండబ్ల్యుపిఎస్) ఈ వివరాల్ని వెల్లడించింది. వీసా ఎక్స్‌పైర్ అయిపోవడంతో, అతను పోలీస్ స్టేషన్‌కి వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితే ఇమ్మాన్యుయేల్ స్నేహితుడు జార్జ్‌కి ఎదురయ్యింది. జార్జ్ కూడా ఇవే సమస్యలను ఎదుర్కొంటున్నాడు. మొహమ్మద్ అనే వ్యక్తి కూడా ఆ కంపెనీతో ఇవే సమస్యలను ఫేస్ చేయాల్సి వచ్చింది. తాను ఎలాగైనా తన స్వదేశానికి వెళ్ళాల్సి ఉందనీ, ఇక్కడే ఉండి పని చేయలేకపోతున్నాననీ కేవలం 100 బహ్రెయినీ దినార్స్ మాత్రమే తనకు జీతం వస్తోందని వాపోయాడు ఇమ్మాన్యుయేల్. సెలవు ఇస్తే, తిరిగి వచ్చి పనిచేసేందుకు సిద్ధమని స్పాన్సర్‌తో చెప్పినా అతను అంగీకరించడంలేదని ఇమ్మాన్యుయేల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







