జనసంద్రమైన చెన్నై వీధులు ..
- December 05, 2016
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థీవ దేహాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రాజాజీహాల్ ప్రాంతంతో పాటు చెన్నైవీధులు జన సంద్రమైయ్యాయి. చివరిసారిగా అమ్మను చూసేందుకు రాష్ట్ర నలుమూలాల నుంచి అమ్మ అభిమానులు, ఏఐడీఎంకే పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో చెన్నై నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ప్రజల సందర్శనార్ధం పార్థీవ దేహాన్ని ఉంచిన రాజాజీ హాల్ పరిసర ప్రాంతాల్లోను భద్రత కట్టుదిట్టం చేశారు. భారీకేడ్లు ఏర్పాటు చేసి క్యూలలో ప్రజలను పంపిస్తున్నారు.
జయలలితతో తమకున్న అనుబంధాన్ని పార్టీ కార్యకర్తలు, ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అమ్మకు కడసారిగా కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. చెన్నై మెరీనా బీచ్ లోని ఎంజీఆర్ సమాధి పక్కన మంగళవారం సాయంత్రం 5-6 గంటల మధ్య జయలలిత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







