పీఎస్ఎల్వీ-36 ఘనవిజయం
- December 06, 2016
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇస్రో పీఎస్ఎల్వీ సిరీస్‌లో 38వ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ సీ-36 ద్వారా 1235 కేజీల బరువైన రిసోర్స్‌శాట్-2ఎ ఉపగ్రహాన్ని నిర్ణీత వ్యవధిలో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సోమవారం రాత్రి 10.25 గంటలకు నుంచి నిరంతరాయంగా కొనసాగిన కౌంట్‌డౌన్ పూర్తికాగానే రిసోర్స్‌శాట్-2ఎ అనే ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ36 రాకెట్ మోసుకెళ్లింది.బహుళ ప్రయోజనాల రాకెట్‌గా పేరుగాంచిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పీఎస్ఎల్వీ ద్వారా 36వరుస విజయాలు అందుకున్న ఇస్రో మరో మైలు రాయిని అధిగమించింది. పీఎస్ఎల్వీ సీ-36 రాకెట్ ద్వారా వెళ్లే రిసోర్స్‌శాట్-2ఎ ఉపగ్రహం రైతులకు ఎంతో మేలు చేయనుంది. ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఏ మేరకు దిగుబడి వస్తుంది, వ్యవసాయానికి అనుకూల ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో తెలియజేస్తుంది. ఐదేళ్లపాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది.ఇప్పటి వరకు దేశవిదేశాలకు చెందిన 121 ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి చేర్చింది. 1994నుంచి 79 విదేశీ ఉపగ్రహాలను వివిధ కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. దేశానికి చెందిన 42ఉపగ్రహాలను ఇస్రో విశ్వంలోకి చేర్చి బలమైన సాంకేతిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్‌ను నిలబెట్టింది. తాజాగా ప్రయోగమైన పీఎస్ఎల్వీ సీ-36 ద్వారా 1235 కేజీల బరువైన రిసోర్స్‌శాట్-2ఎ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా చేర్చారు.రిసోర్స్‌శాట్-2 కాలపరిమితి ముగియడంతో దాని స్థానంలో ఇస్రో 2ఎ ఉపగ్రహాన్ని చేర్చింది. ఈ ఉపగ్రహంలో ఇస్రో శాస్త్రవేత్తలు మూడు పెలోడ్లను పొందుపర్చారు. 5.8మీటర్ల స్పేషియల్ రెజల్యుషన్ ఉన్న సెల్ఫ్ స్కానర్, మూడు స్పక్ట్రల్ బ్యాండ్లలో ఆపరేటింగ్ కెమెరాను అమర్చారు. 5రోజులు పాటు సందర్శించేలా వీటిని డిజైన్ చేశారు.మరోవైపు సమాచార సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆధునిక సాంకేతికను ఇస్రో రిసోర్స్ శాట్-2ఎలో పొందుపర్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్‌లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







