యూ.ఏ.ఈ. లో పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రుల దృష్టి అధికం
- September 03, 2015
నేటి పోటీ ప్రపంచంలో పిల్లలు తమ భవిష్యత్ లక్ష్యాలను సాధించాలంటే ప్రతిష్టాత్మక యూనివర్సిటీ చదువు చాలా అవసరమని యూ. ఏ. ఈ. 92 శాతం తల్లిదండ్రులు నమ్ముతున్నట్టు HSBC వారి 16 దేశాల్లో, యూ. ఏ. ఈ. నుండి 450 మందితో సహా మొత్తం 5550 తల్లిదండ్రుల నుండి జరిగిన అభిప్రాయ సేకరణ - 'వాల్యూ ఆఫ్ ఎడుకేషన్-2015:లెర్నింగ్ ఆఫ్ లైఫ్' తెలియజేసింది. ఈ భావన యూ. ఏ. ఈ. లో నానాటికి పెరుగుతూ వస్తోందని, ఇంకా వారు తమ పిల్లల చదువులపై అనేక ఆశలు పెట్టుకున్నారని, 89 శాతం మంది - పిల్లలు ఎల్.కె.జి. స్థాయిలో ఉన్నప్పటినించే, ఫలానా రంగంలో రాణించడానికి ప్రణాళికలు వేస్తుంటారని తెలియవచ్చింది. ఇంకా 33 శాతం మంది వైద్యం, 16 శాతం మంది ఇంజనీరింగ్, 11 శాతం మంది కంప్యూటర్ సైన్స్ చదివించాలని నిర్ణయించుకున్నట్టు తెలియవచ్చింది. ఇంకా, 80 శాతం మంది తమ పిల్లల్ను పోస్ట్ గ్రాడ్యుఏట్లు గా చూడాలని తహతహలాడుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







