యూఏఈలో సోషల్ మీడియా యూజర్స్‌కి 6 లీగల్ రిస్క్‌లు ఇవే
- December 07, 2016
సోషల్ మీడియాలో ఏమైనా చేయవచ్చునని కొందరు అనుకుంటారు. లక్షలాది మందిని ఒకే వేదికపై కలవడానికి సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడ్తుంది. తమ భావాల్ని ఇతరులతో పంచుకోడానికి ఇదో చక్కని వేదిక. అయితే ఇది చాలా సందర్భాల్లో దుర్వినియోగమవుతోంది. అనేక అనర్ధాలకూ ఇదే వేదికవుతోంది. ఈ కారణంగా యూఏఈ ప్రభుత్వం సోషల్ మీడియా వాడకానికి సంబంధించి కొన్ని నిబంధనల్ని తెరపైకి తెచ్చింది. వాటిని అతిక్రమిస్తే కొన్ని సమస్యలు తప్పవు. కాబట్టి ఈ క్రింది ఆరు ముఖ్యమైన విషయాల్ని యూఏఈలోని సోషల్ మీడియా యూజర్లు గుర్తుంచుకోవాలి.
ఫొటోలను పోస్ట్ చేయడం: వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరాదు. ప్రైవసీ మరియు కాన్ఫిడెన్షియాలిటీ: ఇతరు వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి, వారి పర్సనల్ ఫొటోల్ని వారి అనుమతి లేకుండా పోస్ట్ చేయడం నేరం. డిఫేమేటరీ స్టేట్మెంట్స్: ఇతరుల్ని డిఫేమ్ చేయడానికి సోషల్ మీడియాని వినియోగించరాదు. అభ్యంతరకరమైన తీరు: అన్ ఇస్లామిక్, నేరాల్ని ప్రోత్సహించేటటువంటి ఎలాంటి కామెంట్స్ పిక్చర్స్ సోషల్ మీడియాలో ఉంచరాదు. సామాజిక బాధ్యత ఇక్కడ అతి ముఖ్యం. ఇతరుల మనోభావాల్ని దెబ్బతీయకూడదు.ఆన్లైన్ మానిటరింగ్: యూఏఈ టిఆర్ఎ ఎప్పటికప్పుడు ఆన్లైన్ కంటెంట్‌ని మానిటరింగ్ చేస్తోంది. హేకింగ్, మాలిక్యులస్ కోడ్స్ వంటివాటిని పర్యవేక్షిస్తుంటుంది. లైసెన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా అభ్యంతరకరమైన కంటెంట్‌ని బ్లాక్ చేసే అధికారం కలిగి ఉన్నాయి.
తాజా వార్తలు
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!
- కువైట్ లో హెల్త్ కేర్ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్..!!
- మస్కట్ లో ఒమన్ పెర్ఫ్యూమ్ షో ప్రారంభం..!!
- గల్ఫ్ ఐక్యతకు బహ్రెయిన్ – కువైట్ ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి…
- ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు
- అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







